naeem: నయీం మొత్తం 1038 ఎకరాలు డీల్ చేశాడు!: సిట్ అధికారులు
- సెటిల్ మెంట్ ద్వారా కొన్ని, రిజిస్ట్రేషన్ల ద్వారా కొన్ని డీల్ చేసిన వైనం
- రిజిస్ట్రేషన్ చేయించిన భూములను ప్రభుత్వం ఏమీ చేయలేదు
- నయీం దందాలపై 237 కేసులు
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం 1038 ఎకరాలను ఆక్రమించుకున్నాడని సిట్ అధికారులు తెలిపారు. ఈ 1038 ఎకరాల్లో సెటిల్ మెంట్ భూములతో పాటు, చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు కూడా ఉన్నాయని వారు తెలిపారు. దీంతో, రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూముల విషయంలో ప్రభుత్వం వాటిని రద్దు చేయలేదని సిట్ అధికారులు తెలిపారు.
చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఆ భూముల రిజిస్ట్రేషన్లను న్యాయస్థానం రద్దు చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా, నయీం దందాపై మొత్తం 237 కేసులు నమోదయ్యాయని వారు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో తీవ్ర అక్రమాలకు పాల్పడిన నయీంను ఎన్ కౌంటర్ లో పోలీసులు హతమార్చిన సంగతి తెలిసిందే.