union minister: హిందువుల వల్లే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంటుంది: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
- చాలా జిల్లాల్లో హిందువుల సంఖ్య తగ్గిపోతోంది
- దేశ సమగ్రతకు ఇది భంగం
- అన్ని మతాలకు కుటుంబ నియంత్రణ అమలు చేయాలి
దేశంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడే ప్రజాస్వామ్యం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిలకడగా ఉంటుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఓ ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. సమాజంలో ఎక్కువగా ఉన్న వర్గం సంఖ్య దిగజారినపుడు స్థిరత్వం, అభివృద్ధి కూడా కుంటుపడతాయని ఆయన అన్నారు.
'ఉత్తర ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో హిందువుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ జిల్లాల్లో ముస్లింల సంఖ్య పెరిగిపోతోంది. అది దేశ సమగ్రత, ఏకీకృతానికి భంగం కలిగిస్తుంది' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. అలాగే అన్ని మతాల వారికి కుటుంబ నియంత్రణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.