miss world: 17 ఏళ్ల తరువాత మిస్ వరల్డ్‌గా భారతీయ యువతి!
- మిస్ వరల్డ్‌గా హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ (20)
- ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లండ్ యువతులు
- ‘మిస్ వరల్డ్ 2017’ పోటీల్లో 108 మందితో తీవ్రమైన పోటీ
‘మిస్ వరల్డ్ 2017’గా భారతీయ యువతి నిలిచింది. ఈ రోజు చైనాలోని సాన్యా నగరంలో జరిగిన ఫైనల్స్‌లో హర్యానాకు చెందిన 20 ఏళ్ల మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. అప్పట్లో భారత్ నుంచి 29 మందితో పోటీ పడిన మానుషి మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికైంది. ‘మిస్ వరల్డ్ 2017’ పోటీల్లో 108 మందితో తీవ్రమైన పోటీని ఎదుర్కుంది. 17 ఏళ్ల క్రితం (2000 సంవత్సరంలో) ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం సాధించిన సుందరులు ఎవ్వరూ లేరు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లండ్ యువతులు నిలిచారు.