YSRCP: ఎదుగుదలకు సహకరిస్తానని యువతిని మోసం చేసిన వైకాపా నేత... విజయవాడలో అరెస్ట్

  • ఆర్థికంగా, శారీరకంగా వాడుకున్నారు
  • సీపీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
  • సీపీ ఆదేశాలతో విచారించిన పటమట పోలీసులు

రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తానని నమ్మ బలికి, ఓ యువతిని మోసం చేశారన్న ఆరోపణలపై వైకాపా నేత తన్నీరు నాగేశ్వరరావును విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ కృష్ణా జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడిగా ఉంటూ, గతంలో జగ్గయ్యపేట పురపాలక సంఘం మాజీ చైర్మన్ గా పనిచేసిన తన్నీరుపై పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని మోసం చేయడంతో పాటు, చంపుతానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. కేసును విచారించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని సీపీ నుంచి పటమట పోలీసులకు ఆదేశాలు వెళ్లడంతో, వారు జగ్గయ్యపేటకు వెళ్లి, విచారించి, ప్రాథమిక ఆధారాలు లభించడంతో నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. తాను జిల్లా పరిషత్ స్టీరింగ్ కమిటీలో ఉన్న సమయంలో, అధ్యక్ష పదవి ఇప్పిస్తానని మాయమాటలు చెప్పగా, తాను ఎన్నోమార్లు డబ్బు ఖర్చు పెట్టి జన సమీకరణలు చేశానని బాధితురాలు మీడియా ముందు వాపోయారు. తాను నిలదీస్తే వల్గర్ గా మాట్లాడారని, ఆపై ఎన్నో రకాలుగా వేధించాడని ఆరోపించారు.

  • Loading...

More Telugu News