nv prasad: 'లౌక్యం', 'రేసుగుర్రం'పై నిర్మాత ఎన్వీ ప్రసాద్, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ మధ్య తీవ్ర వాగ్వాదం!

  • కలెక్షన్లే కొలమానాలు కావాలన్న ఎన్వీ ప్రసాద్
  • జ్యూరీ అన్ని సినిమాలను చూసే అవార్డులు ఇచ్చిందన్న త్రిపురనేని
  • అభిమానుల అభిప్రాయం కూడా సమస్యను జటిలం చేసిందన్న వీరశంకర్

అల్లు అర్జున్ నటించిన 'రేసుగుర్రం' చిత్రాన్ని కాదని గౌపీచంద్ నటించిన 'లౌక్యం' సినిమాకు అవార్డును ఇవ్వడంపై నిర్మాత ఎన్వీ ప్రసాద్, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ టీవీ చానల్ లైవ్ లో వీరిద్దరూ పాల్గొన్న వేళ ఉత్తమ ప్రజాదరణ అవార్డు పొందాలంటే కొలమానాలు ఏంటన్న విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన కలెక్షన్లు తీసుకుని ఆదరణను లెక్కించాలని ఎన్వీ ప్రసాద్ వ్యాఖ్యానించగా, జ్యూరీ అన్ని సినిమాలనూ చూసి నిర్ణయం తీసుకుంటుందని త్రిపురనేని కామెంట్ చేశారు.

రుద్రమదేవి సినిమాకు సంబంధించి దరఖాస్తు చేసిన కేటగిరీలో కాకుండా, వేరే కేటగిరీలో అల్లు అర్జున్ కు అవార్డు ఇవ్వడాన్ని ఎన్వీ తప్పుబట్టారు. దీనిక్కూడా కౌంటరేసిన త్రిపురనేని, అల్లు అర్జున్ ఆ చిత్రంలో ఓ క్యారెక్టర్ మాత్రమే చేశాడని, హీరో కాదని గుర్తు చేస్తూ, అతని కృషికి గుర్తింపుగా మరో కేటగిరీలో అవార్డును ఇవ్వడం తప్పేంటని ప్రశ్నించారు. వీరిద్దరి చర్చ మధ్యా కల్పించుకున్న దర్శకుడు వీరశంకర్, అభిమానులు తమ హీరో అల్లు అర్జున్ ను ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తించరని భావించడం కూడా సమస్యను జటిలం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రకాశ్ రాజ్ వంటి వాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్టులని తెలుగు సినీ అభిమానుల్లో ఓ ముద్ర పడిపోయిందని చెప్పిన ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న పదాన్ని వాడటమే జ్యూరీ తప్పయిందని అన్నారు.

  • Loading...

More Telugu News