priya ranjandas munshi: తొమ్మిదేళ్లుగా కోమాలో ఉండి తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ
- ప్రియరంజన్ దాస్ మున్షీ మృతి
- 2008లో కోమాలోకి వెళ్లిన మున్షీ
- జర్మనీకి తీసుకెళ్లినా మెరుగుపడని ఆరోగ్యం
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ (72) తుదిశ్వాస విడిచారు. గత తొమ్మిదేళ్లుగా కోమాలోనే ఉన్న ఆయన ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన మృతిని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. 2008లో గుండె పోటు వచ్చినప్పుడు షాక్ తో ఆయన కోమాలోకి వెళ్లారు. స్టెమ్ సెల్ థెరపీ కోసం ఆయనను కుటుంబసభ్యులు జర్మనీకి కూడా తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ ఇక్కడికే తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.
తిరిగి అక్టోబర్ 12న ఆయనకు మళ్లీ గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి నానాటికీ క్షీణిస్తుండటంతో... అక్కడి నుంచి అపోలోకు తరలించి, చికిత్స అందిస్తూ వచ్చారు. మన్మోహన్ కేబినెట్ లో ఆయన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు 20 ఏళ్లు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో ఓ మ్యాచ్ కు కమిషనర్ గా వ్యవహరించిన ప్రథమ భారతీయ వ్యక్తి ఈయనే.