Kamal Haasan: 'నేరం ఒప్పుకోకపోవడం నేరం కాదా?' అంటూ శశికళను నిలదీసిన కమలహాసన్
- ప్రభుత్వం దోపిడీకి పాల్పడితే నేరం
- నేరం బయటపడిన తరువాత కూడా అంగీకరించకపోవడం నేరం కాదా?
- క్రిమినల్ రాజ్యం సాగదు.. ప్రజలు న్యాయమూర్తులుగా మారాలి
తమిళనాట ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరిట శశికళ కుటుంబసభ్యులు లక్ష్యంగా నిర్వహించిన ఐటీ సోదాల్లో వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ‘ప్రభుత్వం దోపిడీలకు పాల్పడితే అది నేరం. కానీ నేరం బయటపడిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడం నేరం కాదా? గంట మోగింది. ఇక క్రిమినల్ రాజ్యం సాగదు. ప్రజలు న్యాయమూర్తులుగా మారాలి. మేల్కోండి’ అంటూ ట్వీట్ చేశారు.