twitter: లావుగా ఉన్నావని హేళన చేసిన ట్విట్టర్ ఫ్రెండ్... కేసు వేసిన మహిళ!
- లావుగా ఉంటే జీవించే హక్కు లేదు అని ట్విట్టర్లో పేర్కొన్న విదేశీయుడు
- వైరల్ అయిన ట్వీట్
- అతడితో ట్విట్టర్లో వాదించిన ముంబయి మహిళ
- కోపంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం
లావుగా ఉన్న వారిపై ట్విట్టర్లో ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌పై మండిపడ్డ ఓ మహిళ అతడిపై కేసు వేసిన ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. లావుగా ఉన్న వారిపై ట్వీట్ చేసిన ఓ విదేశీయుడు 'లావుగా ఉంటే జీవించే హక్కు లేదు' అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. ఓ ముంబయి మహిళ ట్విట్టర్లో అతడితో చర్చ జరపగా ఆమెను ఆ యూజర్ పలు మాటలు అన్నాడు. లావుగా ఉండడం తప్పేనని గట్టిగా వాదించాడు. తనను కూడా లావుగా ఉన్నావని అన్నాడని ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లిపోయింది.
అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. సెక్షన్ 354 ప్రకారం ఆ గుర్తుతెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్టర్ ఐడీ ద్వారా నిందితుడి గురించి ఆరా తీస్తున్నామని, అతడు ఆఫ్రికన్లా ఉన్నాడని దాదర్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సునీల్ దేశ్‌ముఖ్ మీడియాకు వివరించారు.