umang: ఈ-గ‌వ‌ర్నెన్స్ యాప్ ఉమంగ్‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

  • ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌ల‌లో ల‌భ్యం
  • డిజిట‌ల్ ఇండియాలో భాగంగా యాప్ ఆవిష్క‌ర‌ణ‌
  • అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు ఒకే యాప్‌లో

అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లను ఒకే ప్లాట్‌ఫాం ద్వారా క‌ల్పించే యోచ‌న‌తో రూపొందించిన ఉమంగ్ Umang (యూనిఫైడ్ మొబైల్ అప్లికేష‌న్ ఫ‌ర్ న్యూ ఏజ్ గ‌వ‌ర్నెన్స్‌) యాప్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆవిష్క‌రించారు. న్యూఢిల్లీలో జ‌రుగుతున్న 5వ‌ గ్లోబ‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ సైబ‌ర్‌స్పేస్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డిజిట‌ల్ ఇండియా గురించి ప్ర‌సంగించి, ఈ యాప్‌ను విడుద‌ల చేశారు.

ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌, ఐఓఎస్ స్టోర్‌, విండోస్ స్టోర్ల‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఆధార్, డిజి లాక‌ర్‌ల‌తో పాటు స్థానిక సంస్థ‌ల నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర‌కు అన్ని రకాల ప్ర‌భుత్వ సేవ‌ల‌ను ఈ యాప్ ద్వారా పొందవ‌చ్చు. 9718397183 నెంబ‌ర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

  • Loading...

More Telugu News