second test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. పిచ్ స్వభావం ఎలా ఉంటుందంటే..!

  • నాగపూర్ లో రెండో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభం 

భారత్-శ్రీలంకల మధ్య రెండో టెస్టు నాగపూర్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చండిమల్ బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. వివాహం కారణంగా బౌలర్ భువనేశ్వర్ కుమార్, వ్యక్తిగత కారణాలతో శిఖర్ ధావన్, గాయం కారణంగా షమీ ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. వీరి స్థానంలో రోహిత్ శర్మ, విజయ్, ఇషాంత్ శర్మలు జట్టులోకి వచ్చారు. శ్రీలంక మాత్రం తొలి టెస్టు ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ మాదిరే నాగపూర్ పిచ్ కూడా పచ్చికతో కూడి ఉంది. తొలిరోజు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లో బ్యాటింగ్ కు అనుకూలించవచ్చు. చివరి రెండు రోజులు మాత్రం బంతి మెలికలు తిరుగుతూ, అనూహ్యంగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:
భారత్: రాహుల్, మురళీ విజయ్, పుజారా, కోహ్లీ, రహానే, రోహిత్ శర్మ, అశ్విన్, సాహా, జడేజా, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ.
శ్రీలంక: సమరవిక్రమ, కరుణరత్నే, తిరిమన్నే, మాథ్యూస్, చండిమల్, డిక్ వెల్లా, షనక, పెరీరా, హెరాత్, లక్మల్, గమాగే.

మరోవైపు, బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఓపెనర్లు ధాటిగా తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించారు. 2 ఓవర్లలో 10 పరుగులు సాధించారు. సమరవిక్రమ (6), కరుణరత్నే (4) క్రీజులో ఉన్నారు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ లు బౌలింగ్ ను ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News