coffee: కాఫీతో ఎన్ని ప్రయోజనాలో.. పలు జబ్బులు మాయం!
- కాఫీ ప్రియులకు శుభవార్త
- గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ
- డిప్రెషన్, సైరోసిస్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులకూ దూరంగా ఉండొచ్చు
- అతిగా మాత్రం తాగొద్దు
ఉదయం లేవగానే కాఫీ తాగందే కొందరికి ఏ పనీ చేయాలనిపించదు. అలసటగా ఉన్నప్పుడు, స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు కప్పు కాఫీ రుచి చూడాల్సిందేనని భావిస్తారు. అలాంటి కాఫీ ప్రియులకు శుభవార్త చెప్పారు సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. కాఫీ తాగని వారితో పోలిస్తే తాగేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. కొన్ని రకాల జబ్బులు రాకుండా కూడా కాఫీ ఉపయోగపడుతుందని తెలిపారు.
అతిగా కాఫీ తాగకుండా రోజుకి మూడు లేక నాలుగు కప్పుల కాఫీ తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. గుండె సంబంధిత వ్యాధుల నుంచే కాకుండా డిప్రెషన్, ఆల్జైమర్స్, సైరోసిస్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులకు కూడా కాఫీతో మంచి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అయితే, గర్భంతో ఉన్న మహిళలు కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్పారు.