jeff bezos: వంద బిలియన్ డాలర్లకు చేరిన జెఫ్ బెజోస్ సంపాదన
- బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పుంజుకున్న అమెజాన్ లాభాలు
- అక్టోబర్‌లో బిల్‌గేట్స్ సంపాదన దాటేసిన జెఫ్
- ఛారిటీ వైపు దృష్టి సారించిన అమెజాన్ అధినేత
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 100.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. శుక్రవారం నాటి బ్లాక్ ఫ్రైడే సేల్స్ కారణంగా అమెజాన్ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగిపోవడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. అక్టోబర్‌లో బిల్‌గేట్స్‌ని దాటేసి తొలి స్థానంలోకి దూసుకొచ్చిన జెఫ్ బిజోస్ 1999 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి బిలియనీర్‌గా నిలిచారు.
1999లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఈ ఘనత సాధించారు. అయితే తన సంపదలో ఎక్కువ భాగం సమాజసేవ కోసం ఇచ్చేశారు. అలా చేయకపోయి ఉంటే బిల్‌గేట్స్ సంపద 150 బిలియన్ డాలర్ల వరకూ ఉండేది. ఈ ఒక్క ఏడాదిలోనే బెజోస్ సంపద 32.6బిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. బిల్‌గేట్స్ బాటలోనే బెజోస్ కూడా ఇటీవల ఛారిటీ వైపు దృష్టి సారించారు. తన సంపద ఎలా ఖర్చు పెట్టాలో చెప్పండంటూ ఆయన సోషల్ మీడియాలో సలహాలు కూడా కోరారు.