black friday: బ్లాక్ ఫ్రైడే సేల్‌ని నిషేధించిన పాకిస్థాన్ హైకోర్టు
- ఇస్లాం బోధనలకు వ్యతిరేకమని వ్యాఖ్య
- పవిత్ర శుక్రవారాన్ని కించపరిచిందంటూ పిటిషన్
- విదేశాలకు చెందిన బ్లాక్ ఫ్రైడే
అమెరికా, ఇంగ్లాండ్ వంటి పాశ్చాత్య దేశాల్లో జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. అయితే ఇది ఇస్లాం బోధనలను కించపరుస్తోందంటూ ఓ వ్యక్తి పాకిస్థాన్ హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు దేశవ్యాప్తంగా బ్లాక్ ఫ్రైడే పేరుతో జరిగే వేడుకలను, అమ్మకాలను నిషేధించాలని తీర్పునిచ్చింది.
ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారానికి 'బ్లాక్' అనే పదం జోడించి దాని పవిత్రతను దెబ్బతీశారంటూ సదరు వ్యక్తి పిటిషన్‌లో పేర్కొనట్లు తెలుస్తోంది. పిటిషన్‌దారుడితో ఏకీభవించిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. థ్యాంక్స్‌గివింగ్‌కి ముందు శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి క్రిస్‌మస్ షాపింగ్ సీజన్ ప్రారంభమవుతుందని పాశ్చాత్యులు నమ్ముతారు.