rajasekhar: తమ్మారెడ్డి భరద్వాజ నాకు డబ్బులు ఎగ్గొట్టాలనుకున్నారు .. కుదరలేదనే కోపంతో అలా చెప్పారు!: రాజశేఖర్
- డబ్బులు వసూలు చేయడం మా వలన అయ్యేది కాదు
- అందువలన సత్యారెడ్డి గారిని పెట్టుకున్నాం
- తమ్మారెడ్డి భరద్వాజ నుంచి రావలసిన డబ్బును ఆయన వసూలు చేశాడు
- ఆ కోపంతో తమ్మారెడ్డి భరద్వాజ అలా మాట్లాడారు
"మీ వలన బాగా ఎఫెక్ట్ అయ్యానని పబ్లిక్ గా చెప్పుకుని బయటపడినది తమ్మారెడ్డి భరద్వాజ గారు .. 'వేటగాడు' సినిమా విషయంలో. అంతగా మీ వలన ఆయన ఎఫెక్ట్ అయింది ఏంటి?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ కి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " తమ్మారెడ్డి భరద్వాజ 'వేటగాడు' సినిమా గురించి మాట్లాడారు. ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారో .. ఎన్ని హిట్స్ ఇచ్చారో చెప్పండి? నాకు తెలియక అడుగుతున్నాను. నాతో ఒక సినిమా చేసినంత మాత్రాన ఆయన లైఫ్ దెబ్బతినదు" అన్నారు రాజశేఖర్.
'వేటగాడు'కు ముందు నేను చేసిన కొన్ని సినిమాల వాళ్లు నాకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. ఈ విషయాలు మాట్లాడటానికి నేను .. జీవిత పనికిరామని భావించాను. మంచి రెమ్యునరేషన్ మాట్లాడలేకపోతున్నాం .. మాట్లాడిన రెమ్యునరేషన్ ను వసూలు చేసుకోలేకపోతున్నాం. ఇలా జరుగుతుండటంతో, ఇకపై మనం మాట్లాడకూడదనుకుని .. మాకు సంబంధించిన విషయాలను చూసుకోమంటూ సత్యారెడ్డి గారిని పెట్టుకున్నాం" అని చెప్పారు
"తమ్మారెడ్డి భరద్వాజ గారు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడదామని చూస్తున్నారు .. ఒకవేళ ఆయన మీకు ఫోన్ చేస్తే మీరు సైలెంట్ గా వుండి పోండి. ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు .." అని సత్యారెడ్డి గారు అన్నారు. 'వేటగాడు' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది .. తమ్మారెడ్డి భరద్వాజ నాకు డబ్బులు ఇవ్వకుండా రిలీజ్ చేయలేరు. ఆ సమయంలో సత్యారెడ్డి గారు మా డబ్బులు మాకు వచ్చేలా చేసేశారు. తమ్మారెడ్డి భరద్వాజ ఎగ్గొడదామని అనుకున్నారు .. అది జరగకపోవడంతో ఆయనకి బాగా కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఆయన అలా మాట్లాడారు. 'ఆడలేనమ్మ స్టేజ్ సరిగ్గా లేదందట' అంటూ రాజశేఖర్ ఒక తమిళ నానుడిని చెప్పడం విశేషం.