Hyderabad: హైదరాబాద్ మెట్రోరైలు ఛార్జీలు ఖరారు.. వివరాలు!
- కనిష్ఠ ఛార్జీ రూ.10
- గరిష్ఠ చార్జీ రూ.60
- 2 కిలోమీటర్ల వరకు ఛార్జీ-రూ.10
26 కి.మీ.ల పైన-రూ.60
హైదరాబాదీల కలల బండి మెట్రో రైల్‌ను ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 29 నుంచి ప్రయాణికులు మెట్రో రైల్ సేవలను అందుకోవచ్చు. రేపటి నుంచి మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయాలు జరుపుతారు. మెట్రోరైల్ ఛార్జీల వివరాలను అధికారులు వివరించారు.
ఛార్జీల వివరాలు...
కనిష్ఠ ఛార్జీ రూ.10
గరిష్ఠ చార్జీ రూ.60
2 కిలోమీటర్ల వరకు ఛార్జీ-రూ.10
2 కి.మీ నుంచి 4 కి.మీ.ల వరకు ధర-రూ.15
4 కి.మీ నుంచి 6 కి.మీల వరకు - 25
6 కి.మీ నుంచి 8 కి.మీ.ల వరకు - రూ.30
8 కి.మీల నుంచి 10 కి.మీల వరకు- రూ.35
10 కి.మీ నుంచి 14 కి.మీ.ల వరకు-రూ.40
14 కి.మీ నుంచి 18 కి.మీ.ల వరకు -రూ.45
18 కి.మీ నుంచి 22 కి.మీ.ల వరకు- రూ.50
22 కి.మీ నుంచి 26 కి.మీ.ల వరకు -రూ.55
26 కి.మీ.ల పైన-రూ.60