stalin: ఢిల్లీలో ధర్నాకు తెలంగాణ సర్కారు నిర్ణయం.. మద్దతు తెలుపుతూ కేసీఆర్కు డీఎంకే నేత స్టాలిన్ లేఖ!
- రిజర్వేషన్ల అమలు అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ సర్కారు డిమాండ్
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన స్టాలిన్
- మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్లను అమలు పరిచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్కారు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయంపై తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల కోసం తలపెట్టిన ధర్నాకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.