madhya pradesh: బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష... చట్టం తేనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం!
- 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష
- చట్టం తేవాలని మధ్యప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయం
- ఇటువంటి చట్టం రావాల్సిన అవసరం ఉంది- మధ్యప్రదేశ్ హోం మంత్రి
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసే మృగాళ్లకు ఉరిశిక్ష విధించాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించి, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
దీనిపై త్వరలోనే చట్టం తీసుకురానున్నారు. ఇటువంటి చట్టం రావాల్సిన అవసరం వచ్చిందని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్లో అత్యాచారాలు, వేధింపుల కేసులు మరింత పెరిగిపోయాయి. అత్యాచార నేరాలకు ఆ రాష్ట్ర శిక్షా స్మృతిని సవరించనున్నారు.