begampeta: రేపు మధ్యాహ్నం 1.10 గం.లకు బేగంపేటకు మోదీ.. 2.45 గం.లకు మెట్రోరైల్ పరుగులు!
- ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్, కేసీఆర్, మంత్రులు
- విమానాశ్రయంలోనే బీజేపీ నేతలతో మోదీ భేటీ
- మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాఫ్టర్‌లో మియాపూర్
- మధ్యాహ్నం 3.25కి హెచ్ఐసీసీకి.. ఇవాంక ట్రంప్‌తో భేటీ
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న విషయం తెలిసిందే. అలాగే, హైదరాబాద్ వాసుల కలల బండి మెట్రోరైల్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలుకుతారు.
విమానాశ్రయంలోనే బీజేపీ నేతలతో మోదీ సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాఫ్టర్‌లో మియాపూర్ వెళతారు. రైల్వే స్టేషన్ హెచ్ఎంఆర్ పైలాన్‌ను ఆవిష్కరించిన తరువాత మెట్రోరైల్‌పై రూపొందించిన షార్ట్‌ఫిలిం ప్రదర్శనను, బ్రోచర్‌ను విడుదల చేస్తారు.
మరిన్ని వివరాలు...
- రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు మెట్రోరైల్ ప్రారంభం
- మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు వెళ్లి.. మళ్లీ అదే ట్రైన్లో వెనక్కి మోదీ
- హెలికాఫ్టర్‌లో మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి ప్రధాని
- మధ్యాహ్నం 3.25కి హెచ్ఐసీసీకి
- 20 నిమిషాల పాటు ఇవాంక ట్రంప్‌తో మోదీ సమావేశం
- అనంతరం ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభం