GES: జీఈఎస్ సదస్సులో ఒకే ఒక్క ముస్లిం మహిళా వ్యాపారవేత్తకు మాట్లాడే అవకాశం!
- జీఈఎస్ సదస్సులో మాట్లాడే ఒకేఒక్క ముస్లిం మహిళ
- జాబితాలో ఆఫ్ఘన్ వ్యాపారవేత్త రోయో మెహబూబా
- మాట్లాడే అవకాశమున్న జాబితాలో సానియా మీర్జా
హైదరాబాదు వేదికగా రేపు ప్రారంభం కానున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు (జీఈఎస్) లో 150 దేశాల నుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సదస్సులో ప్రసంగించనున్న మహిళా పారిశ్రామిక వేత్తల పేర్ల జాబితాను జీఈఎస్ వెబ్ సైట్ లో వెల్లడించారు. ఈ సదస్సులో మాట్లాడే వక్తలలో కేవలం ఒకేఒక్క ముస్లిం మహిళకు అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ఆప్ఘనిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త రోయో మెహబూబా దక్కించుకున్నారు.
అలాగే మాట్లాడే అవకాశం ఉన్న వారి జాబితాలో హైదరాబాదీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును చేర్చారు. దీనిపై డెవలప్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇస్లామిక్ బ్యాంకింగ్ నిపుణుడు ఒకరు మాట్లాడుతూ, ముస్లిం కమ్యూనిటీలో మహిళా వ్యాపారవేత్తల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. ఈ వెనుకబాటుతనం కేవలం ముస్లిం మహిళల్లోనే కాకుండా హిందూ కమ్యూనిటీలో షెడ్యూల్డ్ కుల వర్గాల్లో కూడా ఉందని పేర్కొన్నారు.