Narendra Modi: ఇవాంకకు మోదీ ఇస్తున్న విందులో.. నోరూరించనున్న వంటకాలు ఇవే!
- రాత్రి 8.45 గంటలకు విందు
- అతిథుల నోరూరించబోతున్న వంటకాలు
- గంధం, కుంకుమ మేళవించిన వంటకాలకు ప్రాధాన్యత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకు ప్రధాని మోదీ ఈ రాత్రికి విందు ఇవ్వనున్నారు. ఫలక్ నుమా ప్యాలస్ లో ఈ విందు కార్యక్రమం జరగనుంది. రాత్రి 8.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ విందుకు ఇవాంకా ట్రంప్, కేసీఆర్, అమెరికా ప్రతినిధులు, పలువురు రాజకీయ వేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరవుతారు. ఫలక్ నుమా లోని 101 డైనింగ్ హాల్ లో ఈ విందు జరగనుంది. అతిథులకు విందు ఇచ్చేందుకు నిజాం రాజు ఈ డైనింగ్ హాల్ ను నిర్మించారు. ఇప్పుడు ఈ హాల్ ఇవాంక విందు కార్యక్రమానికి వేదిక కానుంది.
మోదీ ఇస్తున్న ఈ విందులో పలు వంటకాలు అతిథులను నోరూరించబోతున్నాయి. ముఖ్యంగా గంధం, కుంకుమ వేళవించిన వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఘోస్ట్ షికాంపురీ కీబాబ్, దహీ కే కీబాబ్, కుబానీ కే మలాయ్ కోఫ్తా, ముర్గ్ పిస్తా కా సలాన్, సితాఫల్ కుల్ఫీ, అఘజ్ సూప్, వాక్ఫా, మెజ్ బన్, మహ్ గూల్ దస్తర్ క్వాన్, గులాబ్ జామ్ తదితర ఎన్నో వెరైటీలు అతిథుల కోసం రెడీ అవుతున్నాయి. వీటన్నింటితో పాటు భారతీయ, హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మరిన్ని వంటకాలు ఉంటాయి. ఒక్కో అతిథికి ఒక్కో వ్యక్తి ఈ వంటకాలన్నింటినీ వడ్డిస్తారు.