rajasekhar: అంకుశం .. శివ సినిమాల విషయంలో అలా జరిగింది!: డా. రాజశేఖర్
- తెలుగులో 'అంకుశం' సూపర్ హిట్
- కానీ ఆ క్రేజ్ కి 'శివ' అడ్డుపడింది
- ఈ రెండూ తమిళంలో విడుదలయ్యాయి
- 'శివ'ను మించిన సక్సెస్ ను 'అంకుశం' సొంతం చేసుకుంది
"ఇప్పట్లో సినిమాలు ఒక వన్ వీక్ నడిస్తే చాలు .. అప్పట్లో ఇలా ఉండేది కాదు. 100 .. 200 రోజులు నడిచేవి. అలాంటి పరిస్థితుల్లో 'అంకుశం' సినిమా వచ్చిన 3 నెలలకి 'శివ' సినిమా వచ్చింది. 'అంకుశం' ఒక రేంజ్ లో దూసుకుపోతూ ఉండగా వచ్చిన 'శివ' .. 'అంకుశం'ను కనబడకుండా చేసింది. అప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ కి ఎదురైంది.
అప్పుడు రాజశేఖర్ స్పందిస్తూ .. "అప్పుడు మేమంతా కొంచెం బాధపడ్డాం .. 'శివ' వచ్చి 'అంకుశం'ను కప్పి పుచ్చిందని అనుకున్నాం. తమిళ వెర్షన్లో ఆ బాధ తీరిపోయింది .. 'ఇది దాండా పోలీస్' అని మేం 'అంకుశం'ను తమిళంలో రిలీజ్ చేశాం. వాళ్లేమో 'శివ'ను 'ఉదయం' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా అక్కడ నడవలేదు .. కనపడకుండా పోయింది. అలా 'అంకుశం' .. 'శివ' విషయంలో తెలుగుకి సంబంధించినంత వరకూ బాధపడినా, తమిళంలో 'శివ'ను మించి 'అంకుశం' దూసుకుపోవడం సంతోషాన్ని కలిగించింది" అంటూ చెప్పుకొచ్చారు.