cherry blair: బిగ్ డిబేట్: క్వింటోస్, చెర్రీ బ్లెయిర్, ఇవాంకా ట్రంప్, చంద కొచ్చర్... మధ్యలో కేటీఆర్!

  • రెండో రోజు జీఈఎస్-2017 చర్చలు ప్రారంభం
  • 'ఉయ్ కెన్ డూ ఇట్' అంటున్న ఔత్సాహిక మహిళలు
  • తొలి సెషన్ సంధానకర్తగా కేటీఆర్

హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ రెండో రోజు ఉల్లాసభరిత వాతావరణంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలి సెషన్ మహిళా పారిశ్రామికవేత్తలు, నైపుణ్యాలపై చర్చా గోష్ఠి జరిగింది. ఈ చర్చకు సంధానకర్తగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొనగా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఐసీఐసీఐ ఎండీ చందకొచ్చర్, టెక్సాస్ నుంచి వచ్చిన డెల్ ప్రతినిధి, యువ మహిళా పారిశ్రామికవేత్త క్వింటోస్ పాల్గొన్నారు.

 'వీ కెన్ డూ ఇట్' థీమ్ తో చర్చ సాగింది. తెలంగాణలో ప్రైవేటు రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, మహిళలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరిస్తూనే, కేటీఆర్ మిగతా వారితో పలు అంశాలపై చర్చించారు. మహిళా సాధికారత, వ్యవసాయం పెట్టుబడులు, వ్యాపార మెళకువలు, ఆరోగ్యం, క్రీడలు, మీడియా, వినోదం వంటి రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.

మహిళల గురించి తనకు ఎంతో చెప్పాలని ఉందని, అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు మరింతగా ప్రోత్సాహం కల్పించాల్సి వుందని, అందుకు అమెరికా ప్రభుత్వం ఎంతో చేస్తోందని ఇవాంకా వ్యాఖ్యానించారు. వంటగది నుంచి మహిళలు బయటకు రావడం చాలా దేశాల్లో మొదలైందని, ఈ విషయంలో ఇండియా, అమెరికాలు ముందున్నాయని అన్నారు. ఇండియాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, కుటీర పరిశ్రమల స్థాయి నుంచి వారిని మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాయికి నడిపించాల్సి వుందని చందకొచ్చర్ పేర్కొన్నారు. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తే మహిళలు మరింతగా రాణించగలరని చెర్రీ బ్లెయిర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

  • Loading...

More Telugu News