subramanian swamy: బాలీవుడ్ సినిమాలపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

  • బాలీవుడ్ కు దుబాయ్ నుంచి ఆర్థిక సహకారం అందుతోంది
  • బాలీవుడ్ పై సుప్రీంకోర్టు పరిశీలన జరపాలి
  • భారతీయుల సినిమాలను భారతీయుల కోసమే తీయాలి

సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఈసారి బాలీవుడ్ ను టార్గెట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమకు దుబాయ్ నుంచి ఆర్థిక సహకారం అందుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వివాదాస్పద చిత్రం 'పద్మావతి'పై విమర్శల వర్షం కురిపించారు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి, తన ప్రాణత్యాగంతో ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన రాణీ పద్మావతిని ఓ నృత్య కళాకారిణిగా చూపించడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కర్కోటకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీని గొప్ప వ్యక్తిగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు.

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సుప్రీంకోర్టు పరిశీలన చేయాలని స్వామి కోరారు. బాలీవుడ్ చిత్రాలను కేవలం భారతీయుల కోసమే నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై సీబీఎఫ్సీ సభ్యుడు అర్జున్ గుప్తా స్పందించారు. స్వామి వ్యాఖ్యలపై ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. 'పద్మావతి' చిత్రానికి సంబంధించిన ఆర్థిక సహకారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News