snehalata sri vatsava: స్నేహలత శ్రీవాత్సవ.... లోక్‌సభ మొదటి మహిళా జనరల్ సెక్రటరీ
- డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు
- సంవత్సరం పాటు పదవీకాలం
- మధ్యప్రదేశ్‌కి చెందిన స్నేహలత
స్నేహలత శ్రీవాత్సవను లోక్‌సభ నూతన జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో నియమితురాలైన మొదటి మహిళగా స్నేహలత నిలిచారు. ఆమె డిసెంబర్ 1న బాధ్యతలు తీసుకుని నవంబర్ 30, 2018 వరకు పదవిలో కొనసాగనున్నారు.
ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అనూప్ మిశ్రా నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. 1982 మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్‌కి చెందిన స్నేహలత గతంలో న్యాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్‌గా రమాదేవి నిలిచిన సంగతి తెలిసిందే.