North Korea: కాసేపట్లో ఉ.కొరియా కీలక ప్రకటన.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని విశ్లేషకుల ఆందోళన!
- ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకటన
- ఆ దేశ అధికారిక రేడియో స్టేషన్‌లో ప్రసారమైన వార్త
- దక్షిణకొరియా మీడియా కూడా నిర్ధారణ
- అమెరికాను రెచ్చగొట్టే ప్రకటన?
ఈ రోజు తెల్లవారుజామున ఐసీబీఎం ప్రయోగంతో మరోసారి ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాన్ని రేకెత్తించిన ఉత్తరకొరియా కాసేపట్లో ఓ కీలక ప్రకటన చేయనుందట. ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తరకొరియా ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రకటన చేయనుందని ఆ దేశ అధికారిక రేడియో స్టేషన్‌లో ప్రసారమైనట్లు తెలిసింది.
ఉత్తరకొరియా ఏ ప్రకటన చేయనుందోనన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఉత్తరకొరియా కాసేపట్లో ప్రకటన చేయనున్న విషయాన్ని దక్షిణకొరియా మీడియా సంస్థలు కూడా నిర్ధారించాయి. ఒకవేళ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికాను రెచ్చగొట్టే ప్రకటన చేస్తే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.