rahul gandhi: రాహుల్ ఎన్నిక ప్రక్రియ యావత్తూ రిగ్గింగే... సంచలన విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత!

  • రాహుల్ ముందు తన పదవికి రాజీనామా చేయాలి
  • ఒక వ్యక్తి కోసం జరుగుతున్న నాటకమిది
  • మహారాష్ట్ర నేత షెహజాద్ పొన్నావాలా

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని నిలిపేందుకు ఓ నాటకం జరుగుతోందని, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ యావత్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతోందని ఆ పార్టీ మహారాష్ట్ర సీనియర్ నేత షెహజాద్ పొన్నావాలా సంచలన విమర్శలు చేశారు. ఎన్నిక యావత్తూ రిగ్గింగేనని అభివర్ణించారు. ఇదేమీ వాస్తవ ఎన్నిక కాదని, సిగ్గుపడాల్సిన ఎన్నికని అన్నారు. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిని పైకి తెచ్చేందుకు జరుగుతున్న డ్రామా అని అన్నారు.

జరుగుతున్న తప్పును తాను ఎత్తి చూపుతున్నానని, కాంగ్రెస్ లోని ఎంతో మందికి ఈ విషయమై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ముందుగా తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆపై అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడాలని అన్నారు. ఈ ఎన్నిక పారదర్శకంగా జరిగేట్టయితే బాగుంటుందని, ఇదే విషయాన్ని రాహుల్ కు లేఖ ద్వారా తెలిపానని అన్నారు. పూర్తి రిగ్ అయిన ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని, అసలు ఈ విధానమే తప్పుల తడకని, ఈ ఎన్నికల్లో ఓటు వేసే కాంగ్రెస్ నేతలెవరూ సక్రమంగా నమోదైన వారు కాదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News