crime rate: నేరాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానం... ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి!
- 'క్రైమ్స్ ఇన్ ఇండియా 2016' నివేదిక
- విడుదల చేసిన కేంద్ర హోం మంత్రి
- అత్యధిక క్రైమ్ రేట్‌లో ఢిల్లీకి మొదటి స్థానం
2016 సంవత్సరానికి గాను 'క్రైమ్స్ ఇన్ ఇండియా 2016' పేరుతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేసిన ఈ నివేదికలో గతేడాది జరిగిన నేరాల్లో అధిక భాగం ఉత్తర ప్రదేశ్‌లోనే జరిగినట్లు తేలింది. ఇక క్రైమ్ రేట్ విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.
2015తో పోల్చినపుడు 2016లో హత్యా నేరాలు, దొంగతనాల్లో కొంత తగ్గుదల కనిపించింది. కానీ అపహరణ కేసులు పెరిగాయని నివేదిక వెల్లడించింది. అలాగే మహిళలపై నేరాలు కూడా పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. రేప్ కేసుల్లో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలు వరుసగా నిలిచాయి. ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరిగినట్లు నివేదిక పేర్కొంది.