saeed ajmal: రిటైరవుతూ ఐసీసీకి సవాల్ విసిరిన పాక్ వివాదాస్పద బౌలర్ సయీద్!
- అంతర్జాతీయ క్రికెట్ కు అజ్మల్ గుడ్ బై
- బౌలర్లందరినీ టెస్ట్ చేయండి.. 90 శాతం మంది ఫెయిల్ అవుతారన్న అజ్మల్
- అసంతృప్తితో రిటైర్ అవుతున్నానన్న స్పిన్నర్
పాకిస్థాన్ వివాదాస్పద స్పిన్నర్ సయీద్ అజ్మల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐసీసీ తీరుతో చాలా అసంతృప్తితో రిటైర్ అవుతున్నానని చెప్పాడు. తన బౌలింగ్ యాక్షన్ సరిగా లేదంటూ రెండు సార్లు తనను ఐసీసీ నిషేధించిందని... ఐసీసీకి తాను ఓ సవాల్ విసురుతున్నానని... ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బౌలర్లందరినీ ఒక్కసారి పరీక్షించాలని... వారిలో 90 శాతం మంది కచ్చితంగా ఫెయిల్ అవుతారని ఛాలెంజ్ చేశాడు.
2011 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తో ఆడిన మ్యాచ్ తనకు ఇప్పటికీ అర్థం కాలేదని సయీద్ చెప్పాడు. ఆ మ్యాచ్ లో 37వ ఓవర్లో తన బౌలింగ్ లో అఫ్రిదీకి క్యాచ్ ఇచ్చి సచిన్ ఔటయ్యాడని... అంతకు ముందు తన బౌలింగ్ లోనే వికెట్ల ముందు దొరికిపోయాడని... కానీ, ఆ రెండు సార్లు కూడా సచిన్ ను అంపైర్లు నాటౌట్ గానే ప్రకటించారని... అలా ఎందుకు చేశారో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. ఆ మ్యాచ్ లో సచిన్ 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడని చెప్పాడు.