kim jang un: క్షిపణి పరీక్షలకు ముందు శాస్త్రవేత్తలతో కిమ్ జాంగ్ ఏమన్నారంటే...!
- శాస్త్రవేత్తల్లో స్పూర్తి నింపిన కిమ్ జాంగ్ ఉన్
- ప్రయోగానికి రెండు నెలల ముందే ఆదేశాలు
- దేశం కోసం ధైర్యంగా పరీక్షించమని ఆదేశం
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలతో ఆ దేశం ఖండాతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. రెండు నెలల పాటు మౌనంగా ఉన్న ఉత్తరకొరియా ఎవరూ వూహించని విధంగా క్షిపణి ప్రయాణ పరిధితో పాటు మోసుకెళ్లే పేలుడు పదార్థం బరువు సామర్థ్యాన్ని పెంచుతూ విజయవంతంగా పరీక్షించింది. ఉత్తరకొరియా ఇలా ప్రయోగం చేయడం వెనుక ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రోత్సాహమే కారణమని తెలుస్తోంది.
ఈ ప్రయోగం చేపట్టడానికి రెండు నెలల ముందు శాస్త్రవేత్తలు, మిలటరీ ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన ‘‘ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని ఆమోదిస్తున్నాను. నవంబర్ 29న పరీక్షించండి. పార్టీ, దేశం కోసం ధైర్యంగా పరీక్షించండి’’ అంటూ అభయమిచ్చారు. దీంతో శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో మేధస్సుకు పదునుపెట్టారు.
గతంలో సాధించిన క్షిపణి పరీక్షల విజయాలను స్పూర్తిగా తీసుకుని, సరికొత్త అణ్వాయుధ ఖండాంతర క్షిపణికి రూపకల్పన చేశారు. దానిని విజయవంతంగా పరీక్షించి సత్తా చాటారు. ఇది 2,796 మైళ్లు ఎత్తు, 596 మైళ్ల దూరం ప్రయాణించిన అనంతరం అమెరికా మొత్తం తమ అధీనంలోకి వచ్చేసిందని, ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.