New Delhi: కొత్త రూపు సంతరించుకున్న రాజధాని ఎక్స్ ప్రెస్... ఫోటోలు చూడండి!
- సుందరంగా, సురక్షితంగా బోగీలు
- రూ. 35 లక్షలతో అధునాతన కోచ్ లు
- న్యూఢిల్లీ - సెల్డా మధ్య పరుగులు
- మారిపోనున్న రాజధాని, శతాబ్ది రైళ్ల రూపురేఖలు
ప్రధాన రైళ్లను మరింత సుందరంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ఉన్న రైల్వే శాఖ, సెల్డా నుంచి న్యూఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ ను సమూలంగా మార్చి చూపింది. సీసీటీవీ కెమెరాలు, ఎల్ఈడీ లైట్ల నుంచి, మరింత సౌకర్యవంతమైన బెర్తులు, పరిశుభ్రమైన కారిడార్లను ఏర్పాటు చేసి, మరింత ప్రయాణానుభూతిని కలిగించింది.
ఈ మేరకు రైల్వే శాఖ ఓ ట్వీట్ చేస్తూ రైలు నంబర్ 12314 న్యూఢిల్లీ - సెల్డా రాజధాని ఫోటోలను ఉంచింది. 'స్వర్ణ' ప్రాజెక్టులో భాగంగా ఈ మార్పులు చేర్పులను చేపట్టామని, ఒక్కో కోచ్ ని రూ. 35 లక్షలతో తయారు చేశామని చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను దగ్గర చేసేందుకు 14 రాజధాని, 15 శతాబ్ది రైళ్లను అప్ గ్రేడ్ చేయనున్నామని పేర్కొంది. రైల్వే శాఖ చేసిన ట్వీట్ ను మీరూ చూడవచ్చు.