Chandrababu: పోలవరంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు: పార్టీ నేతలకు చంద్రబాబు సూచన
- కేంద్రంపై విమర్శలు చేయవద్దు
- పోలవరంను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం
- రాజకీయం చేయడం మన ఉద్దేశం కాదు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడుతూ, విమర్శించవద్దని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడతానని చెప్పారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏపీకి సాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.
కేంద్రం నుంచి వచ్చిన లేఖకు తప్పనిసరిగా జవాబు ఇస్తామని చెప్పారు. పోలవరంను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని... రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. పోలవరం విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని తమ శ్రేణులకు సూచించారు. పోలవరం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ అంశాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని అన్నారు.