miss world: దీపిక ప‌దుకునేపై దాడులు జ‌రిపితే న‌జ‌రానాలు ఇస్తామ‌నడం ఏంటీ?: మిస్‌ వరల్డ్

  • దీపిక ఒక న‌టి మాత్ర‌మేనని నిర‌స‌న‌కారులు గుర్తుంచుకోవాలి
  • సినిమా విడుదలను అడ్డుకుంటామనడం భావ్యం కాదు 
  • సినిమా బృందానికి నా మద్దతు

దీపిక ప‌దుకునే న‌టించిన‌ బాలీవుడ్ సినిమా ప‌ద్మావ‌తి వివాదాల్లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమెను చంపేయాలంటూ రాజ్‌పుత్ క‌ర్ణిసేన చేసిన వ్యాఖ్య‌ల‌పై మిస్‌ వరల్డ్‌-2017 మానుషి చిల్లర్‌ స్పందించారు. దీపిక పదుకొనే కేవలం ఒక న‌టి మాత్ర‌మేనన్న విషయాన్ని నిరసనకారులు గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.

తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఆ సినిమా బృందానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అభ్యంతరాలు లేవనెత్తుతూ కొందరు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. దాడులు జ‌రిపితే న‌జ‌రానాలు ఇస్తామ‌ని ప్రకటించటం భావ్యం కాద‌ని ఆమె వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News