alaska air lines: ఫేస్ బుక్ అధినేత సోదరికి అలస్కా ఎయిర్ లైన్స్ లో వేధింపులు.. ట్విట్టర్ లో ఆవేదన!

  • అలస్కా ఎయిర్ లైన్స్ లో లైంగిక వేధింపులు 
  • వేధింపుల పర్వాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన రాండీ జుకర్ బర్గ్
  • మూడు గంటలపాటు వేధింపులకు పాల్పడిన పక్కసీటు వ్యక్తి

అలాస్కా ఎయిర్‌ లైన్స్‌ లో ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సోదరి రాండీ జుకర్‌ బర్గ్‌ కు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఫేస్ బుక్ మార్కెటింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న రాండీ జుకర్ బర్గ్ అలాస్కా ఎయిర్‌ లైన్స్‌ కి చెందిన విమానంలో మెక్సికోకు ప్రయాణించారు. ఆ సమయంలో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడు తాగి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

 దీంతో ఆగ్రహం వ్యక్తం చేసి, అతని గురించి విమాన సిబ్బందికి రాండీ ఫిర్యాదు చేయగా, నిందితుడు తరచూ ఆ విమానంలో ప్రయాణిస్తుంటాడని, సర్దుకుపోవాలని చెప్పి లైట్ తీసుకున్నారట. దీంతో మూడు గంటలపాటు అతని వేధింపులను భరించాల్సి వచ్చిందని సోషల్ మీడియా పోస్టులో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ వేధింపులను వివరిస్తూ అలాస్కా ఎయిర్‌ కార్పొరేట్‌ స్టాఫ్‌ కు మెయిల్‌ చేశానని ఆమె వెల్లడించారు. సర్దుకుపొమ్మన్న సిబ్బంది... నిందితుడితో పరాచికాలాడుతూ, అడిగినంత మద్యం ఇస్తూనే ఉన్నారని ఆమె మండిపడ్డారు. దీనిపై అలాస్కా ఎయిర్ లైన్స్ సంస్థ ప్రతినిధి ఎగన్‌ స్పందిస్తూ, రాండీ పట్ల జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని ప్రకటించారు. 

  • Loading...

More Telugu News