Cricket: రెండు రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లీ... మురళీ విజయ్ 150
- ఏడాదిలో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ గా కోహ్లీ
- ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా
- 150 పరుగులు చేసిన మురళీ విజయ్
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా శ్రీలంకతో చివరి టెస్టులో టీమిండియా పరుగుల వరద పారిస్తోంది. భారత్ కు మురళీ విజయ్ (143) శుభారంభం ఇవ్వగా, శిఖర్ ధావన్ (23) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన భారత్ నయావాల్ ఛటేశ్వర్ పూజారా (23) కూడా అవుటయ్యాడు. దీంతో బరిలో దిగిన కెప్టెన్ కోహ్లీ (122) అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. అలాగే ఒక క్యాలెండర్ ఏడాదిలో 3000 పరుగులు చేసిన కెప్టెన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు రికార్డును బద్దలు చేయాలని కోహ్లీ సేన బలంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావిస్తోంది. లంకేయులు కోహ్లీపై దృష్టి కేంద్రీకరించడంతో మురళీ విజయ్ తనపని తాను చేసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మురళీ విజయ్ 150 పరుగుల మైలు రాయిని దాటాడు. దీంతో వీరిద్దరూ మూడో వికెట్ కు 250 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 81.4 ఓవర్లు ఆడిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.