whatsapp: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల‌కు కొత్త స‌దుపాయాలు... త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న యాప్‌

  • గ్రూప్ స‌భ్యుల పోస్టుల‌ను క‌ట్ట‌డి చేసే హ‌క్కు
  • 'రెస్ట్రిక్టెడ్ గ్రూప్స్' పేరుతో అందుబాటులోకి
  • నియంత్రణ‌కు గురైన వారు పోస్ట్ చేయాలంటే అడ్మిన్‌ని సంప్ర‌దించాల్సిందే

త్వ‌ర‌లో గ్రూప్ అడ్మినిస్ట్రేట‌ర్ల‌కు కొన్ని ప్ర‌త్యేక హ‌క్కుల‌ను వాట్సాప్ క‌ల్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే బీటా వెర్ష‌న్ టెస్టింగ్ కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. 'రెస్ట్రిక్టెడ్ గ్రూప్స్' పేరుతో ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని స‌హాయంతో గ్రూపులో ఇబ్బంది పెడుతున్న స‌భ్యుల‌ పోస్టులు, ఇమేజ్‌లు, వీడియోలు పెట్టే అధికారాన్ని క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. వారికి కేవ‌లం గ్రూప్‌లో వ‌చ్చే మెసేజ్‌, ఫొటోలు, వీడియోలను చూసే అధికారం ఉంటుంది.

ఒకవేళ నియంత్ర‌ణ‌కు గురైన స‌భ్యులు ఏదైనా పోస్టు పెట్టాల‌నుకుంటే 'మెసేజ్ అడ్మిన్‌' అనే స‌దుపాయం ద్వారా అడ్మిన్‌ని సంప్ర‌దించాల్సి ఉంటుంది. వారి మెసేజ్‌ని అడ్మిన్ చూసి, ఆమోదిస్తేనే గ్రూప్‌లో పోస్ట్ అవుతుంది. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల గ్రూపుకి సంబంధంలేని పోస్టులు చేసే వారిని నియంత్రించ‌వ‌చ్చు. త్వ‌ర‌లో ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News