Asaduddin Owaisi: ముందు ఆ 20 లక్షల మందినీ రక్షించి ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆలోచించండి.. ప్రధానిపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ!

  • షరియత్ చట్టాల విషయంలో వేలు పెట్టడం మానుకోవాలని సూచన
  • 20 లక్షల మంది హిందూ మహిళలను భర్తలు వదిలివేశారన్న హైదరాబాద్ ఎంపీ
  •  సంఘ్ పరివార్‌పైనా మండిపాటు

కేంద్రం తీసుకురావాలని యోచిస్తున్న ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘షరియత్’ను రక్షించుకునేందుకు భారతీయ ముస్లింలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తీర్పు గందరగోళంగా ఉందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం ఈ బిల్లును ఎలా తీసుకొస్తుందని ప్రశ్నించారు. మిలాద్‌ -ఉన్‌-నబీ సందర్భంగా దారుస్సలాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్న మోదీ ‘హిందూ సోదరీమణుల’ను విస్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దాదాపు 20 లక్షలమంది హిందూ మహిళలను తమ భర్తలు వదిలిపెట్టారని పేర్కొన్నారు. తొలుత వారందరినీ రక్షించాలని కోరారు. కొత్త చట్టం ద్వారా ముస్లింలకు కొత్త కష్టాలు సృష్టించడం మానుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ముస్లిం మహిళలపై జాలి చూపిస్తున్న సంఘ్ పరివార్ ‘పద్మావతి’ సినిమా విడుదలను మాత్రం అడ్డుకుంటోందని విమర్శించారు. ఆ సినిమాను అడ్డుకుంటున్న వారు తమ చట్టాల విషయంలో ఎలా వేలు పెడతారని ఒవైసీ ప్రశ్నించారు. రాజ్‌పుట్‌లను ఆదర్శంగా తీసుకుని ముస్లింలంతా ఏకం కావాలని ఎంపీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News