India: ఢిల్లీ టెస్టుపై కాలుష్యం ఎఫెక్ట్... ఆటగాళ్లకు మాస్కులిచ్చి ఆడిస్తున్న ఐసీసీ!

  • మ్యాచ్ పై కాలుష్యం ప్రభావం
  • కొద్దిసేపు నిలిచిన ఆట
  • మాస్కులు పంపిణీ చేసిన అధికారులు
  • భారత స్కోరు 523/6

దేశ రాజధాని ఢిల్లీలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు క్రికెట్ లో కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆటగాళ్లు బౌలింగ్ చేయలేక, ఆయాస పడుతూ ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో అంపైర్లు కలుగజేసుకుని మ్యాచ్ ని కాసేపు నిలిపివేశారు. ఆపై ఆటగాళ్లందరికీ మాస్కులు పంపిణీ చేయగా, వాటిని ధరించిన క్రికెటర్లు తిరిగి ఆటను ప్రారంభించారు.

కాగా, ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాడు. మరోవైపు ఒక్కో వికెట్ పడిపోతున్నా తనదైన షాట్లతో అలరిస్తూ, భారత్ ను మరింత లీడ్ లోకి తీసుకెళుతున్నాడు. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సందకన్ బౌలింగ్ లో అవుట్ కాగా, ఆపై వచ్చిన అశ్విన్ 4 పరుగులకే గమాగే బౌలింగ్ లో పెరీరాకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో సాహా 1, కోహ్లీ 243 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు.

  • Loading...

More Telugu News