Andhra Pradesh: దక్షిణ కొరియాకు చేరుకున్న చంద్రబాబు బృందం.. నేటి షెడ్యూల్ ఇదే!
- భేటీలతో నేడు చంద్రబాబు బిజీ
- సియోల్, బుసాన్ నగరాలను సందర్శించనున్న బాబు బృందం
- పెట్టుబడులు, కియోతో ఒప్పందమే లక్ష్యంగా టూర్
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దక్షిణ కొరియా చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు కియో కార్ల కంపెనీతో ఒప్పందమే లక్ష్యంగా చంద్రబాబు సౌత్ కొరియాలో అడుగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం బృందం అర్ధరాత్రి దాటాక 2.20 గంటలకు సియోల్ చేరుకుంది. ఉదయం 5.45 గంటలకు భారత రాయబారి విక్రమ్ దొరైస్వామితో సమావేశం అనంతరం 6.50 గంటలకు దాసన్ నెట్వర్క్ చైర్మన్ నామ్ మెయిన్‌వూతో చంద్రబాబు భేటీ అవుతారు. 7 గంటలకు జుసంగ్ ఇంజినీరింగ్ సీఈవో వాన్గ్ చుల్‌జుతో సమావేశమవుతారు. 8.30 గంటలకు లొట్టే కార్పొరేషన్ సీఈఓ వాన్గ్ కాగ్‌జుతో చంద్రబాబు భేటీ అయి వివిధ అంశాల గురించి చర్చిస్తారు.
మంగళ, బుధవారాల్లో చంద్రబాబు బృందం సియోల్, బుసాన్ నగరాల్లో పర్యటించి అక్కడి కియో మోటార్స్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శిస్తుంది. అక్కడ జరిగే బిజినెస్ సెమినార్లో పాల్గొంటుంది. 7వ తేదీన చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.