samsung: అరచేతి స్కాన్‌తో ఫోన్ అన్‌లాక్... కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టనున్న శాంసంగ్
- పేటెంట్ అప్లికేషన్ పెట్టుకున్న శాంసంగ్
- ఆపిల్ ఫేస్ అన్లాక్కి కౌంటర్?
- మడత పెట్టగల స్మార్ట్‌ఫోన్ తయారీ కూడా
స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ విధానాలు కాలంతో పాటు చాలా మారుతూ వస్తున్నాయి. సెక్యూరిటీ కోడ్, వేలిముద్ర స్కాన్, వాయిస్ స్కాన్ల నుంచి ఫేస్ రీడింగ్ స్కాన్ వరకు వచ్చాయి. త్వరలో అరచేతి గీతలను స్కాన్ చేసి ఫోన్ అన్‌లాక్ చేసే సదుపాయాన్ని ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ఇటీవల ఆపిల్ టెన్‌లో అందుబాటులోకి వచ్చిన ఫేస్రీడింగ్ అన్‌లాక్ టెక్నాలజీకి, అరచేతి గీతల రీడింగ్ స్కాన్‌ను శాంసంగ్ కౌంటర్‌గా ప్రవేశపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే మడత పెట్టగల స్మార్ట్ఫోన్లను కూడా శాంసంగ్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లను 2018లో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.