shiva prasad: ఖాళీ విస్తరాకు మా ముందు పెడతాడు.. దానిని చూసుకుంటూ మేం కూర్చోవాలి!: మోదీ గురించి శివప్రసాద్

  • పార్లమెంటులో ఎందుకు ఉన్నామా అనిపించిన పరిస్థితులు ఉన్నాయి
  • చంద్రబాబునాయుడుకి ఓపిక ఎక్కువ.
  • ఏదోఒక రకంగా రాష్ట్రాన్ని ఒడ్డున పడెయ్యాలన్నది ఆయన తపన 

టీడీపీ ఎంపీ శివప్రసాద్  10 టీవీ ఇంటర్వ్యూలో  పోలవరం గురించి స్పందించారు. "మూడున్నరేళ్లుగా ఏమీ మాట్లాడకుండా ఈ పార్లమెంటులో ఎందుకు ఉన్నామా? అనిపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే, ఢిల్లీలోని ప్రభుత్వం మిత్రపక్షమైపోయింది. ఆయన (నరేంద్ర మోదీ)  ఏమీ చెయ్యడు. విస్తరాకు మాత్రం ముందు పెడతాడు. అందులో ఏమీ ఉండవు. మేమా విస్తరాకు చూసుకుంటా కూర్చోవాలి" అంటూ చమత్కరించారు.

 మరి బయటకు రావచ్చుకదా? అని అడిగితే..."ఒక పధ్ధతి ఉంది. ఆయన (చంద్రబాబునాయుడు) ఏదోఒక రకంగా రాష్ట్రాన్ని ఒడ్డున పడెయ్యాలని తపనపడుతున్నాడు. ఊరికే బయటకు వచ్చేస్తే ఏం ప్రయోజనమని ఆయన ఆలోచన. సార్ కి ఓపిక ఎక్కువ. మమ్మల్ని కూడా ఏమీ మాట్లాడవద్దని అంటున్నారు. ఆయనకు సహనం ఎక్కువ ఉంది. చాలా ఓపిక పడతాడు" అని చెప్పారు.

  • Loading...

More Telugu News