costarica: కోస్టారికాలో స్కూబా డైవర్లపై టైగర్ షార్క్ దాడి... భారత సంతతి మహిళ మృతి
- యునెస్కో వారసత్వ ప్రదేశం కోకో దీవిలో ఘటన
- తీవ్రగాయాలవడంతో మరణించిన రోహినా భండారీ
- న్యూయార్క్‌లో ఈక్విటీ మేనేజర్‌గా పనిచేస్తున్న రోహినా
అమెరికాలోని కోస్టారికా దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తున్న పర్యాటకులపై టైగర్ షార్క్ దాడి చేసింది. ఈ దాడిలో భారత సంతతి మహిళ రోహినా భండారీకి తీవ్రగాయాలవడంతో చికిత్స చేసే లోపే ఆమె మృతి చెందారు. యునెస్కో వారసత్వ ప్రదేశమైన కోకో దీవి జాతీయ పార్కులో స్కూబా డైవింగ్ చేసేందుకు 18 మంది సందర్శకులు దిగారు. ఈ దీవి ప్రమాదకరమైన టైగర్ షార్క్‌లకు ప్రసిద్ధి.
న్యూయార్క్‌లోని ఓ ఈక్విటీ కంపెనీలో పనిచేసే రోహినా భండారీ కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ పక్కనే బోటులో ఉన్నవారు షార్క్‌లను తరిమేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆమెను ఒడ్డుకి తీసుకువచ్చేలోపే స్పృహ కోల్పోయిందని, అనంతరం చికిత్స అందించే లోపే మరణించిందని అక్కడి అధికారులు తెలిపారు.