North Korea: ఆందోళ‌న రేపుతోన్న ఉత్త‌ర‌కొరియా తాజా క్షిప‌ణి ప‌రీక్ష‌!

  • వందలాది జెట్‌ విమానాలతో అమెరికా-దక్షిణ కొరియా డ్రిల్
  • కొరియ‌న్ ద్వీపక‌ల్పంలో నాలుగు రోజుల పాటు డ్రిల్‌
  • అమెరికా, ఉత్త‌ర‌కొరియా మధ్య మాట‌ల యుద్ధం

అమెరికాపై అంతెత్తున ఎగిరిపడుతున్న ఉత్త‌ర‌కొరియా మ‌రోసారి అత్యంత శ‌క్తిమంత‌మైన ఖండాంత‌ర క్షిప‌ణిని ప‌రీక్షించి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. దీంతో వందలాది జెట్‌ విమానాలతో అమెరికా-దక్షిణ కొరియా దేశాలు కొరియన్ ద్వీప‌క‌ల్పంపై మాక్ డ్రిల్స్ నిర్వ‌హించి, హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఉత్తరకొరియాకు గ‌ట్టిగా బుద్ధి చెబుతామ‌నేలా అమెరికా.. లక్షల కోట్ల డాలర్లతో అభివృద్ధి చేసిన ఎఫ్‌ -35ని కూడా డ్రిల్‌లో ప్ర‌ద‌ర్శించింది.

ఈ విన్యాసాల్లో ఎఫ్‌-22 రాప్టర్‌ స్టెల్త్‌ యుద్ధ విమానాలు, అత్యాధునిక యుద్ధ విమానాలు పాలు పంచుకుంటున్నాయి. ఈ డ్రిల్ మరో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. దీంతో అమెరికా, ఉత్తరకొరియా మ‌ధ్య మ‌రోసారి అగ్గి రాజుకుంది. ఉత్త‌ర‌కొరియా మ‌రోసారి రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని అమెరికా కొన్ని రోజుల క్రితం హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ హస్వాంగ్‌ -15 క్షిపణిని ప్ర‌యోగించి ఉత్త‌ర‌కొరియా దుందుడుకు చ‌ర్య‌కు పాల్ప‌డింది. అమెరికాకు ఉత్త‌ర‌కొరియా కూడా హెచ్చ‌రిక‌లు చేసింది. రెచ్చగొడితే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో అమెరికా చేస్తోన్న సైనిక విన్యాసాలు ఆందోళ‌న రేపే విధంగా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

  • Loading...

More Telugu News