tu-142: విశాఖ ఆర్కే బీచ్ లో కొలువుదీరిన కార్గిల్ యుద్ధవిమానం!
- ఆర్కే బీచ్ లో టీయూ-142 యుద్ధ విమానం
- 29 ఏళ్లు సేవలందించిన యుద్ధ విమానం
- కార్గిల్ యుద్ధం సహా వివిధ యుధ్ధాల్లో భాగస్వామ్యం
విశాఖపట్నానికి మరో పర్యాటక హంగు చేకూరింది. ఆర్కేబీచ్ లో కురుసుర జలాంతర్గామి ఎదురుగా టీయూ-142 యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేశారు. నావికాదళంలో 1988లో చేరిన ఈ యుద్ధ విమానం కార్గిల్ యుద్ధం సహా పలు ఆపరేషన్లలో వీరోచిత పోరాటం చేసింది. 2017 వరకు 29 ఏళ్ల పాటు 30 వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసింది. సేవల నుంచి నిష్క్రమించడంతో దీనిని ఆర్కే బీచ్ లో ప్రదర్శన శాలగా ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. అనంతరం దీనిని వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతిస్తారు.