metro stations: మెట్రో స్టేషన్లలో చూయింగ్ గమ్‌లు తినడంపై నిషేధం విధించిన నమ్మ మెట్రో
- రైళ్లలో, స్టేషన్లలో చూయింగ్ గమ్‌లు అంటిస్తున్న ప్రయాణికులు
- ఇబ్బందిగా మారుతుందనే అంచనాతో నిషేధం
- అతిక్రమిస్తే రూ. 200 ఫైన్
మెట్రో స్టేషన్లలో, రైళ్లలో చూయింగ్ గమ్‌లు తినడాన్ని నిషేధిస్తూ 'బెంగళూరు నమ్మ మెట్రో' ప్రకటన జారీ చేసింది. అలాగే పాన్, గుట్కా లాంటివి కూడా తినకూడదని ఆదేశించింది. ప్రయాణికులు చూయింగ్ గమ్‌లు తిని, వాటిని రైళ్లలో, స్టేషన్లలో అంటిస్తున్న కారణంగా ఈ రకమైన ఆదేశం తీసుకురావాల్సి వచ్చిందని నమ్మ మెట్రో అధికారులు తెలిపారు.
ఇది అలాగే కొనసాగితే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని వారు అన్నారు. ఈ ఆదేశాన్ని అతిక్రమించిన వారికి రూ. 200 జరిమానా విధించనున్నారు. మెట్రో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతలను ప్రయాణికులు మర్చిపోతున్నారని, ఎక్కడపడితే అక్కడ పాన్ తిని ఉమ్మడం, చూయింగ్ గమ్‌లను అంటించడం వల్ల పారిశుద్ధ్యం దెబ్బతింటోందని అధికారులు చెప్పారు.