ACB: ఏసీబీలోనే అవినీతి చేప... దాడుల సమాచారాన్ని ముందే లీక్ చేస్తున్న అధికారి సస్పెన్షన్!

  • రహస్య విభాగంలో మేనేజర్ గా పని చేస్తున్న శోభన్ బాబు
  • 50 మంది అవినీతి అధికారులకు ముందే ఫోన్ చేసి హెచ్చరికలు
  • వారి నుంచి డబ్బు తీసుకున్న శోభన్ బాబు
  • సస్పెండ్ చేసిన ఏసీబీ డీజీ ఠాకూర్

అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూ, తమకు అందిన ఫిర్యాదులపై రహస్యంగా విచారించి, దాడులు జరిపించే అధికారే అడ్డదారులు తొక్కాడు. దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందే లంచగొండిదారులకు చేరవేసి, భారీ ఎత్తున డబ్బు నొక్కేస్తున్న అధికారి బాగోతం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ రహస్య విభాగంలో మేనేజర్ గా పనిచేస్తున్న శోభన్ బాబు, గత కొంతకాలంగా సీక్రెట్ గా ఉంచాల్సిన దాడుల సమాచారాన్ని బయటకు చేరవేస్తుండగా, పలు కేసుల్లో అధికారులు ఉత్త చేతులతో తిరిగి వచ్చారు.

దీనిపై విచారణ జరిపి, శోభన్ బాబు కాల్ డేటాను పరిశీలించి, లంచావతారుల ఆస్తులు పట్టుబడకపోవడానికి ఆయనే కారణమని తేల్చిన ఏసీబీ డీజీ ఠాకూర్, శోభన్ బాబును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం 50 మంది అవినీతి అధికారులకు ముందుగానే శోభన్ బాబు ఫోన్ చేశాడని గుర్తించినట్టు తెలిపారు. శాఖాపరమైన విచారణ సాగుతోందని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టామని తెలిపారు.

  • Loading...

More Telugu News