shbana azmi: షబానా ఆజ్మీ వల్లే 'పద్మావతి' పిటిషన్ లో సంతకం చెయ్యలేదు: కంగనా రనౌత్
- ‘పద్మావతి’ సినిమాకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టిన షబానా అజ్మీ
- పిటిషన్ పై సంతకం చేయని కంగనా రనౌత్
- షబానా లెఫ్ట్, రైట్ వింగ్ రాజకీయాలు చేస్తారు
‘పద్మావతి’ సినిమాను నిలిపేయాలంటూ రాజ్ పుత్ కర్ణి సేన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. మరికొందరు ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను మూడు సార్లు సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మద్దతు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖుల సంతకాలతో పిటిషన్ ను తయారు చేసి ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నట్టు సీనియర్ నటి షబానా అజ్మీ తెలిపారు.
ఈ పిటిషన్ కు మద్దతుగా బాలీవుడ్ స్టార్లంతా సంతకాలు చేయగా, కంగనా రనౌత్ మాత్రం దీనిపై సంతకం చేయలేదు. దీంతో ఆమె దీపికపై ఈ రకంగా కసి తీర్చుకుందంటూ కథనాలు వెలువడ్డాయి. వీటిపై కంగన స్పందిస్తూ, షబానా అజ్మీ ఎప్పుడూ లెఫ్ట్-రైట్ వింగ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారని అన్నారు. ఈ విషయంలో తనకంటూ కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయని, అందుకే ఇంకా ఆ పిటిషన్ లో సంతకం చేయలేదని ఆమె చెప్పారు. అయితే ఈ విషయంలో దీపికకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం దీపికకు ఉందని కంగన అభిప్రాయపడింది.