global thinkers: టాప్ 50 గ్లోబ‌ల్ థింక‌ర్స్ జాబితా: మొద‌టిస్థానం సాధించిన భార‌త అమెరిక‌న్ క‌మ‌లా హారీస్‌

  • జాబితా విడుద‌ల చేసిన ఫారిన్ పాలసీ మేగ‌జైన్‌
  • డెమోక్ర‌టిక్ పార్టీకి ఊత‌మిస్తోందంటూ పొగ‌డ్త‌
  • నిక్కీ హేలీ, క‌మెడియ‌న్ హ‌స‌న్ మిన్హాజ్‌కి కూడా స్థానం

ప్ర‌ముఖ మేగ‌జైన్ 'ఫారిన్ పాల‌సీ', ఈ ఏడాది టాప్ 50 గ్లోబ‌ల్ థింక‌ర్స్ జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో కాలిఫోర్నియా సెనేట‌ర్, భార‌త అమెరిక‌న్ క‌మ‌లా హారీస్ మొద‌టి స్థానంలో నిలిచారు. ఓపక్క రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హవా నడుస్తున్నప్పటికీ కూడా, డెమోక్ర‌టిక్ పార్టీ ఆశలను ఆమె సజీవంగా నిలుపగలుగుతోందని మేగ‌జైన్ ఆమెను అభివ‌ర్ణించింది. భార‌త త‌ల్లికి, జ‌మైక‌న్ తండ్రికి జ‌న్మించిన క‌మ‌లా హారీస్.. యూఎస్ సెనేట్‌లో అడుగుపెట్టిన మొద‌టి భార‌త అమెరిక‌న్‌. అంతేకాదు, సెనేట్‌లో ఏకైక న‌ల్ల‌జాతీయ మ‌హిళ కూడా ఈమే.

ఇంకా ఈ జాబితాలో మరో ఇద్దరు భార‌త అమెరిక‌న్లు... ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి నిక్కీ హేలీ, క‌మెడియ‌న్ హ‌స‌న్ మిన్హాజ్‌లు కూడా స్థానం సంపాదించారు. ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు మూన్ జే ఇన్‌, చెల్సియా మ్యానింగ్‌, స్టీఫెన్ బ్యానెన్‌, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక‌రోన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

  • Loading...

More Telugu News