peace diamong: దేశాభివృద్ధి కోసం శాంతి వజ్రాన్ని అమ్మిన ఆఫ్రికా దేశం
- రూ. 40 కోట్లకు అమ్ముడైన శాంతి వజ్రం
- ప్రపంచ అతిపెద్ద వజ్రాల్లో శాంతి వజ్రం ఒకటి
- కొనుక్కున్న బ్రిటన్ ధనవంతుడు లారెన్స్ గ్రాఫ్
వివిధ అభివృద్ధి పథకాల అమలు కోసం తమ దేశంలో లభించిన మొదటి వజ్రాన్ని ఆఫ్రికా దేశమైన సియోర్రా లియోన్ అమ్మేసింది. దీన్ని అమ్మడం ద్వారా 6.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 40 కోట్లు) రాబట్టింది. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటైన పీస్ డైమండ్ (శాంతి వజ్రం)ని బ్రిటన్‌కి చెందిన ధనవంతుడు లారెన్స్ గ్రాఫ్ సొంతం చేసుకున్నారు.
709 కేరెట్ల ఈ వజ్రాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ డైమండ్ ట్రేడింగ్ నెట్వర్క్ రాపపోర్ట్ గ్రూప్ న్యూయార్క్‌లో వేలం వేసింది. అధికారికంగా ఓ వజ్రాన్ని వేలం వేయడం సియోర్రా లియోన్ చరిత్రంలో ఇదే మొదటిసారి. ఇలా చేయడం ద్వారా అక్రమంగా జరిగే వజ్రాల ట్రేడింగ్‌ని అరికట్టవచ్చని సియోర్రా లియోన్ ప్రభుత్వం అభిప్రాయపడింది.