time: టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017' ఫైనలిస్టుల జాబితాలో కిమ్ జాంగ్ ఉన్!
- జాబితా విడుదల చేసిన టైమ్ మేగజైన్
- ట్రంప్, బెజోస్లకి కూడా స్థానం
- #Metoo, Dreamersకి అవకాశం
ప్రముఖ మేగజైన్ టైమ్ ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్టుల జాబితాను ప్రకటించింది. ఎన్బీసీ టుడే ఛానల్ లో ఈ జాబితాను మేగజైన్ వెల్లడించింది. గతేడాది వార్తల్లో నిలిచి చాలా మందిని ప్రభావితం చేసిన వ్యక్తిని పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా టైమ్ మేగజైన్ గుర్తిస్తుంది. ఈ ఫైనలిస్టుల జాబితాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా ఉన్నారు.
ఆయనతో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వండర్ ఉమెన్ దర్శకురాలు ప్యాటీ జెన్కిన్స్, శాన్ఫ్రాన్సిస్కో పుట్‌బాల్ ఆటగాడు కొలిన్ కేపర్నిక్, అమెరికా స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ ముల్లర్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఉన్నారు.
అలాగే ఇటీవల హాలీవుడ్లో సంచలనం సృష్టించిన #Metoo, అమెరికాలో నివసించే అనధికార వలసదారులైన Dreamers ఉద్యమ బృందాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరిలో ఒక్కరిని లేదా ఒక సమూహాన్ని పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా టైమ్ మేగజైన్ గుర్తిస్తుంది.