Sahar: తూచ్.. అదంతా నిజం కాదు!: సర్జరీలతో కురూపిలా మారానని ప్రపంచాన్ని నమ్మించిన యువతి అసలు విషయం!
- హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా మారాలని సర్జరీలు చేయించుకుందని వార్త వైరల్
- మేకప్ వేసుకుని, ఫొటో షాప్తో సరదాగా అలా చేశాను
- కోట్లాది మందిని నమ్మించి.. తాజాగా నిజాన్ని బయటపెట్టిన ఇరాన్ యువతి
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా మారాలని భావించిన సహర్ తబర్ (19) అనే ఇరాన్ యువతి 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని, అవి విఫలం కావడంతో కురూపిలా మారిందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనే కాకుండా అన్ని న్యూస్ వెబ్సైట్లలోనూ ఈ వార్త విపరీతంగా పాకింది. అయితే, ఆమె ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదు. అలా మేకప్ చేసుకుని, ఫొటోషాప్ ఉపయోగించి కురూపిలా తయారై ఆమె కోట్లాది మంది చెవుల్లో పువ్వులు పెట్టేసింది.
తాజాగా ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ.. తనకు నటి ఏంజెలినీ జోలీ అంటే చాలా ఇష్టమని, తాను ఆమెలాగే ఉంటానని తాను అనుకుంటానని తెలిపింది. తాను ఆమెలా మారితే ఎలా ఉంటానోనని అనుకునేదాన్నని చెప్పింది. అందు కోసం బరువు కూడా తగ్గినట్లు పేర్కొంది. తాను సరదాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ ఫొటోను చూసి చాలామంది ఎంతో షాక్ అయ్యారని చెప్పింది. తాను కురూపిలా లేనని తెలుపుతూ తన నిజమైన ఫొటోను ఆమె తాజాగా పోస్ట్ చేసింది.
(అప్పట్లో పోస్ట్ చేసిన ఫొటో)